9:28 AM
Posted by MaheshMaragani
రేపటి నుండే పరిక్షలు ....కనీసం ఈ ఒక్క సాయంత్రం అయిన చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం ,హైదరాబాద్ .వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్ , ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు.ఇ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది . టీవీ ఆఫ్ చేశాను .
చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అన్ని సైన్సు టెక్స్ట్ బుక్ తీసాను . "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణహించుకున్నను.ఎందుకంటే అ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబ్బటి .
చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ , నన్ను చూసి అశ్చర్య , భయ ,సంతోషాలకి లోనయింది .
మా అమ్మ : ఏరా చిన్న,పుస్తకాలతో నీకు ఏమి పని రా...
నేను : చదువుకుంటున్నాను అమ్మ ..
మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూసాను పుస్తకం పట్టడం...మళ్లీ ఇప్పుడే
చూడటం కదా ....అందుకే కళ్ళలో నిరు నిండాయి ...సరిగా కనిపించలేదు
నేను : సర్లే కాని , ఉరికే ఇలా నన్ను మాట్లాడించకు అమ్మ , చదువుకుంటున్నాను ...నా కోసం ఎ వెధవ వచ్చిన
నేను లేను అన్ని చెప్పు ....వెళ్లి హార్లిక్స్ బాటిల్ తీసుకోని రా ....తింటూ చదువు కుంటా ....
ఇలోపే ప్రనిల్ గాడు మహేష్ మహేష్ అంటూ వచ్చాడు ....
మా అమ్మ : నీకు వంద ఏళ్ళు ప్రనిల్ ,ఇప్పుడే మా వాడు నీ గురించి ఇలా చెప్తున్నాడు , నువ్వు అలా వచ్చావు .
మా అమ్మ అలా హార్లిక్స్ బాటిల్ కోసం లోపలి వెళ్ళింది ....
ప్రనిల్ : ఎమైంది రా ...ఎవరు ఏమన్నారు నిన్ను , ఏదయినా ఉంటే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా ...ఇలా
పుస్తకం పడితే సమస్యలు పరిష్కారం అవవు రా ...అయిన ఇప్పుడు ఇలా చదివి ఏం చేస్తావ్ రా ..
నేను : బాగా కష్టబడి చదివి కలెక్టర్ అవుతాను ...
ప్రనిల్ : కష్టబడి చదవటం అంటే , ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చదవటం కాదు రా ...విధి దీపాలు కింద కూర్చొని చదవాలి..అప్పుడే కలెక్టర్ అవుతావు .....సినిమాలు లో చూపిస్తారు కదా రా ....
నేను : అవును రా ...అయిన నాకు కలెక్టర్ కంటే ఫ్యాన్ అంటేనే ఇష్టం లే .....నువ్వు కూడ చదువుకో రా ..రేపు మళ్లీ ఫణి గాడు చూపించలేదు అని ఏడుస్తావు.
ప్రనిల్ గాడు అలా వెళ్ళిన పది నిమిషాలకి ...సీతా ఇసరి చేతిలో గిన్న తో ...ఆంటీ ఆంటీ అంటూ వచ్చింది .....
నేను : ఏం కావాలి సీతా ...
సీతా : ఏమి లేదు ...వక గుప్పెడు కంది పప్పు కావాలి అన్ని అమ్మ పంపింది ....
నేను : గుప్పెడు అన్ని చెప్పి గిన్నెడు తిసుపోతావు .....అయిన మేము ఎందుకు ఇవ్వాలి మీకు ....మొన్న లడ్డులు చేసుకొని కనీసం ఒక రెండు రూచి చూడమని కూడ ఇవ్వలేదు కదా మీరు ....
సీతా : మరిచిపోయాను మహేష్ ....పోనీ ఇప్పుడు తీసుకోని రాన్న....
నేను : మాకు వద్దు లే .....అడిగి తీసుకుంటే ఆడుకున్నారు అంటారు అంతా .....రేపు స్కూల్ కి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ లో తీసుకోని రా ....
సీతా : సరే అలాగే తీసుకొస్త లే ...ఆంటీ ఉన్నారా.....?
నేను : మా తాత్తయ్య పుట్టినరోజుకి , వల్ల పుట్టింటికి వెళ్ళింది ....
సీతా : లేదే ....ఇందాకనే చూసాను నేను ఆంటీ నీ ...
నేను : ఇప్పుడే telegram వచ్చింది...ఇందాకే వెళ్ళింది ....
సీతా : అయ్యో మరి నీకు భోజనం ఎలా ....పద మా ఇంట్లో తిందాం గాని...
నేను : ఏంటి ఇది అంతా నా మీద అభిమానమే!!!...తట్టుకోలేకపోతున్న సీతా ...
అమ్మ , సీతా కి గిన్నడు కంది పప్పు కావాలి అంటా...ఇచ్చి పంపు....అలాగే కరియపకు కూడ ఇచ్చి పంపు....లేకుంటే మళ్లీ వస్తుంది...ఆంటీ ఆంటీ అంటూ ......
సీతా కంది పప్పు , కరియపకు తో విజయవంతంగా వల్ల ఇంటికి వెళ్ళింది
అందరిని అలా పంపించి ఇలా టెక్స్ట్ బుక్ లో మొద్దటి లైన్ చదవగానే , నా విపు నేల వైపు ఒరగటం మొద్దలుపెటింది .టెక్స్ట్ బుక్ లో అక్షరాలు మసక మసక గా కనబడుతునాయి. ఇ లక్షణాలు అన్ని నిద్రవే అని కనిబెట్టిన నేను లేచి ,అటు ఇటు తిరుగుతూ చదివాను.అర్ధ గంట లో ఆరు పేజీలు చదివాను.మనిషి అనేవాడు ఎవ్వడు అర గంటకి మించి చదవలేడు.నాకు ఇప్పుడు విరామం కావాలి ...టీవీ ఆన్ చేశాను .శాంతిస్వరూప్ వెళ్ళిపోయాడు ....చిత్రలహరి మొదలింది . టీవీ సౌండ్ పెంచాను.ఏప్పుడు చిరంజీవి సినిమా పాటతొ మొదలయే చిత్రలహరి ఇసారి శోబన్ బాబు పాటతొ మొదలింది."గాలి వాన లో , వాన నీటిలో ...." . ఈ పాట వినలేక టీవీ ఆఫ్ చేయపోతే ,
"టీవీ మీద చేయి పెడితే ,చేతికి వాత పేడత.." అన్నారు శోబన్ బాబు ఫాన్స్ ...అదే మా అమ్మ... వంట గది నుండి
నేను : "శోబన్ బాబు కోసం ఇ మహేష్ బాబు కి వాత పెడతావ...." ఈ చేదు నిజాన్ని అబ్బాద్దం అని చెప్పు అమ్మ ...చెప్పు.
"నేను ఏదైనా ఒక సరే చెప్తాను చిన్న , రెండో సరి చేసి చూపిస్తాను. చుపించామంటావా .....? " అన్ని చాలా నెమ్మదిగా చెప్పింది మా అమ్మ .
టీవీనీ కొద్ది సేపు మా అమ్మ కి అప్పగించి ,తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకోని అలా నా పడక గది లోకి వెళ్లి మంచం ఎక్కాను ...పది నిమిషలు అలా సరిగా పుస్తకం లోకి చూసాను ...ఒక దొమ్మా నన్ను కుడదామని నా చేతి మీద వల్లింది ...పాపం దానికి ఏమి తెలుసు ...ఆది వాలింది పులి మీద అన్ని ....దానిని ప్రాణాలతో పట్టుకొని , దాని రేకలు విరిచేసి నా టెక్స్ట్ బుక్ మీద వదిలేసి దానితో ఆడుకుంటున్నాను. దానికి అర్దమైనట్లు ఉంది ..."దొమ్మా గా పుట్టడం ఎంత దురదృస్తమూ ". క్షమబిక్ష కొసం దీనంగా చుసింది . అ చుప్పూ నేను మా నాన్న వైపు , నన్ను కొడుతున్నపుడు చూసే చుప్పూ లాగా ఉంది . అ చుప్పూ మా నాన్నకి అర్దం కకున్నా , నాకు అర్దమైంది.దానికి రెక్కలు మాత్రం తిరిగి ఇవ్వలేదు గాని స్వేఛ్చ మాత్రం ఇచ్హాను. అ దొమ్మకి మా విధి గుమ్మం చుపించాను.రెక్కలు లేని స్వేఛ్చ వద్దు అనుకున్నది ఏమో ఆది వెళ్ళలేదు . పెన్సిల్ తొ తోసాను ,అయిన వెళ్ళలేదు. ఈ సరి ఉదేసను .వెళ్లిపోయింది.
గోడకి ఉన్న గడియారం గంట కొట్టింది..టైం తొమ్మిది గంటలు అయింది.తెలుగు టెక్స్ట్ బుక్ మళ్లీ తీసుకోని చదవటం మొదలుపెట్టాను ...................................................................
........................................................................
"ఏరా చిన్న ....లే ఇంక ...స్కూల్ కి టైం అవుతుంది ..పోదున్నే లేచి చదువుకోవచ్చు కదా రా...ఇవాళ్ళ పరిక్ష ఉంది కదా " --పోలీసు గొంతు తొ మా నాన్న
ఉలిక్కిపడి లేచాను .
ఒక నిమిషం లో మొఖం కడిగేసి , రెండు నిమిషాలో స్నానం చేసేసి , మరు నిమిషం లో దేవుడి పటం ముందు నిల్చున్నాను.
"దేవుడా ....ఎ రోజుకి అ రోజు నిన్ను కలుదాం అనుకుంటూనే ఉన్నాను
కాని రోజుకి ఇరవై నాలుగు గంటలే కావటం వల్ల ఆది కుదరటం లేదు
ఇ రోజు మాత్రం ఎన్ని పనులు ఉన్న , చివరికి పరిక్షలు ఉన్న , అ పరీక్షలకి
సమయం మించిపోతున్న , నిన్ను కలవాలి అన్ని వచ్చాను...దేవుడు లేడు
అనుకునే మనుషులకి నువ్వు ఉన్నావు అన్ని చూపించాలి ...అలా చూపించాలి
అంటే నన్ను నువ్వు ఫస్ట్ రంక్ తెపించాలి ...పరీక్షకు టైం అయింది .. మళ్లీ కలుదాం ...
ఇట్లు అప్పుడప్పుడు ఎల్లపుడు పూజించే మీ చిన్ని భక్తుడు.."
ఇస్త్రి చేసి ఉన్న నా నీలము కలర్ లాగు , వైట్ కలర్ చొక్కా (మా స్కూల్ డ్రెస్ ) వేసుకొని ,విబూది పెట్టుకొని,పక్క పాపిడి దువ్వుకొని అమ్మ తినిపిస్తున్న ఇడ్లి తింటూ మా టేప్ రికార్డర్ లో పాటలు వింటున్నాను ...ఇది చూసి మా నాన్న కి కుళ్ళు పుట్టింది ..."ఏరా ....పరీక్షా కదా ...పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా " అన్నారు మా నాన్న .
నేను : లేదు నాన్న గారు ...పరీక్షాకి ముందు చదివితే చదివింది మరిచిపోతం అంటా ...అందుకే నేను ఎప్పుడు ఆలాంటి తప్పు చేయను.
నాన్న గారు నాకు ఇ లిస్టు లో ఉన్నవి కావాలి
నట్రాజ్ పెన్సిల్స్ -2
క్యామల్ ఎరేసర్ -1
షార్ప్నర్ -1
30 cms నట్రాజ్ స్కేల్ -1
ఫైవెస్టార్ చాక్లెట్స్ - 2
మా నాన్న : చాక్లెట్స్ ఎందుకు రా .....
నేను : రాస్తూ రాస్తూ అలిసిపోతే తిన్నటానికి నాన్న గారు ....
మా నాన్న : నువ్వు ఎంత సేపు రాస్తావు రా ....పది నిమిషలు అంతే కదా ....
ఏదైన చేసి చూపించడం నాకు అలవాటు కాబ్బటి మా నాన్న తో వాదించాకుండ ఇడ్లి తింటూ ఉన్నాను .
మా నాన్న అలా బయటకి వెళ్లి నా లిస్టు లోవి అన్ని తీసుకొచ్చారు .
పరీక్షా పాడ్ , ఇ లిస్టు లోవి అన్ని బాగ్ లో వేసుకొని స్కూల్ కి వెళ్దాం అని బస్సు
స్టాప్ కి బయలుజేరాను ....
Subscribe to:
Posts (Atom)
